రవిబాబు.. క్రష్ అనుభవాలు ఏంటీ ?
సినిమా షూటింగ్ లకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లిన తొలి చిత్రం ‘క్రష్’. ఇది ఒక టీనేజీ రొమాంటిక్ కామెడీ చిత్రం. రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ క్రష్ షూటింగ్ అనుభవాలని పంచుకున్నారు రవిబాబు.
ప్రభుత్వం విధించిన నిబంధనలతో సినిమాలు తీయడం చాలా కష్టం. దానికి బదులు కామ్‌గా ఇంట్లో కూర్చోవడమే నయం అన్నారు రవిబాబు. హీరో, హీరోయిన్ మధ్య కౌగిలింత సన్నివేశం లేకుండా ఒక లవ్ స్టోరీతో సినిమాను తెరకెక్కించడం ఎలా సాధ్యమవుతుంది? ఒక ఫ్యామిలీ డ్రామాలో పది మంది పక్కనే కూర్చోని భోజనం చేసే సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తాం ? ఇలా చెప్పుకొంటూ పోతే చాలా సన్నివేశాలు చిత్రీకరణకు సాధ్యం కావు అన్నారు.
ఇక క్రష్ విషయానికొస్తే.. 18ఏళ్ల వయసులో ముగ్గురు కుర్రాళ్లలో జరిగే మార్పులే ఈ సినిమా. వాళ్లలో హార్మోన్లు రేసుగుర్రంలా పరుగులు తీస్తుంటాయి. దీనిలో ‘అల్లరి’ లాగే మంచి కామెడీ, పాటలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్ కంటే ముందే 90 శాతం పూర్తి చేసుకున్నాం. మిగిలిన సన్నివేశాలను లాక్‌డౌన్ తరువాత ప్రారంభించామని తెలిపారు. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.