హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ : 10 సెకన్లలో వాహన రుణం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాహనదారులకి గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 10సెకన్లలో వాహనరుణం అందజేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కేవలం పది సెకన్ల లోపే వాహన రుణాన్ని పొందే సౌలభ్యాన్ని దేశవ్యాప్తంగా 1000 నగరాలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విస్తరించనుంది. ప్రి అప్రూవ్డ్ ఖాతాదార్లకు మాత్రమే ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నందున ఎటువంటి గుర్తింపు పత్రాలు అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.
‘జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్స్’గా వ్యవహరించే ఈ సదుపాయాన్ని భీమవరం (ఆంధ్రప్రదేశ్), హర్దోయ్ (ఉత్తరప్రదేశ్), తలస్సెరి (కేరళ), బాలాశోర్ (ఒడిశా) లాంటి నగరాల్లోని వినియోగదారులకూ అందుబాటులో తెచ్చామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.