కరోనాతో హాస్పటల్ అధినేత మృతి

కరోనా మహమ్మారి ధనిక-పేద, రాజు-బంటు, సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేదు. సోకిందంటే ఎంత ఉన్నవారైనా.. చావుతో పోరాడాల్సిందే. తాజాగా ఆసుపత్రి అధినేత కరోనాకి బలయ్యారు. కరోనాతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని శ్రీదేవి నర్సింగ్‌హోమ్‌ అధినేత కోవెలమూడి వెంకటరమణ ప్రసాద్‌ మరణించారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్‌ గురువారం ప్రాణాలొదిలారు.

అందుకే డబ్బులు ఉన్నా కరోనా నుంచి బయటపడలేం. ముందు జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మనల్ని కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణాలో గడిచిన 24గంటల్లో 12వేలకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయ్.