మరో నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్

నిజంగానే హీరో విజయ్ దేవరకొండ అరెస్ట్ అయితే ఓ సంచలనే. కానీ ఇక్కడ అరెస్టయింది విజయ్ దేవరకొండతో యువతులని మోసం చేస్తున్న ఓ మోసగాడు. డూబ్లికేట్ విజయ్ దేవరకొండ అన్నమాట. బాన్సువాడకు చెందిన సాయికిరణ్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ఆయనలా మాట్లాడి యువతులను ఆకర్షించేందుకు యత్నించాడు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు రావడంతో.. విజయ్‌ దేవరకొండ బృందం సభ్యులు సాయికిరణ్‌ను పట్టుకునేందుకు ఒక యువతితో మాట్లాడించి హైదరాబాద్‌కు రప్పించి అరెస్ట్‌ చేశారు.

మరోవైపు ‘ఆర్ఎక్స్100’ దర్శకుడు పేరుతో వాట్సాప్‌ నంబర్‌ను సృష్టించి కథానాయికలు కావాలంటూ ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించగా.. ఇదంతా మోసమని తెలిసింది. దీనిపై దర్శకుడు అజయ్ భూపతి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.