ఆవుపేడ కొనుగోలు చేయనున్న ప్రభుత్వం.. కిలో ఆవుపేడ రూ.150
రైతుల గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఆవుపాల ఒక్కటే ఆదాయంగా ఉండేది. ఇకపై ఆవుపేడ కూడా రైతుకి ఆదాయం తెచ్చిపెట్టనుంది. ఆవుపేడని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కిలో ఆవుపేడకి ఏకంగా రూ. 150 చెల్లించనుంది. అయితే ఆవుపేడ కొనుగోలు చేయనున్నది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
‘గోధన్ న్యాయ్ పథకం’లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆవుపేడ కొనుగోలు చేసి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఏమీ చేయబోతుంది ? అంతే.. ఆ పేడతో వర్మీకంపోస్ట్ (సేంద్రియ ఎరువు) తయారీ చేయనుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గోధన్ కమిటీల ద్వారా ఆవుపేదని సేకరించనున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆవుపేడని కొనుగోలు చేస్తే ఎంత బాగుంటుందో.. !