యూనివర్సీటీ పరీక్షలకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరోనా ప్రభావంతో విద్యా సంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. పరీక్షలు కూడా రద్దవుతున్నాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయ్. ఈ క్రమంలో యూనివర్సీటీ పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. ఈ సస్పెన్స్ కి తెరదించుతూ.. యూనివర్సీటీ పరీక్షలకి కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి హోంశాఖ లేఖరాసింది.

యూజీసీ గైడ్‌లైన్స్, యూనివర్సిటీల అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫైనల్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా నిర్వహించాలని లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సూచింది. ఈ నేపథ్యంలో త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు జరగనున్నాయి.