బాలయ్య.. ఇది నిజామా ?

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో వీరి హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలప  జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. ఓ  హీరోయిన్ అంజలి ఇప్పటికే ఫిక్సయింది. మరో హీరోయిన్ గా అమలాపాల్ కి అవకాశం దక్కిందనే ప్రచారం జరుగుతోంది. ఇక బాలయ్య సినిమా గురించి వైరల్ అవుతున్న మరో న్యూస్.. ‘సూపర్ మ్యాన్’ టైటిల్. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే సూపర్ మ్యాన్ టైటిల్ ని పెట్టాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ.. ఈ రెండు ప్రచారాల్లో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.