నాన్నకు ప్రేమతో.. జగన్ ట్విట్ !


మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు. ఈరోజు ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నాన్న జయంతి రోజున సీఎం జగన్ కుటుంబంతో కలిసి ఇడుపులపాయకి వెళ్లారు. అక్కడ తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇక తండ్రి పుట్టినరోజున సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన కార్యక్రమాలని గుర్తు చేసుకున్నారు. “నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది” అంటూ ట్విట్ చేశారు.