హ్యాపీ బర్త్ డే దాదా !
భారత క్రికెట్ చరిత్రని మార్చేసిన ఇద్దరు గొప్ప సారధుల పుట్టినరోజులు కూడా వరుసగా రావడం విశేషం. జులై 7 – మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు. మంగళవారం మాహీ.. మాహా సౌండ్ దేశం మారుమ్రోగిపోయింది. ఇక ఇవాళ సౌరవ్ గంగూలీ బర్త్ డే. భారత క్రికెట్ స్థితిని, గతిని మార్చిన నాయకుడు గంగూలీ. సొంతగడ్డపైనే కాదు.. విదేశాల్లో షర్ట్ విప్పేసి గర్జించిన టైగర్ మన దాదా.
దాదా బర్త్ డే సందర్భంగా ఆయనకి సన్నిహితులు, స్నేహితులు, తాజా, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వివి. ఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్.. తదితరులు దాదాని ట్విట్టర్ వేదికగా విష్ చేశారు. ఈ సందర్భంగా దాదా సాధించిన విజయాలు, ఆయనతో ఉన్న అనుబంధాలని గుర్తు చేసుకుంటున్నారు.