కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టులో పిటిషన్


తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ప్రగతి భవన్ లో 30మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. సీఎం కేసీఆర్ కు కూడా కరోనా వచ్చింది. అందుకే ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇది తప్పుడు ప్రచారం అని తేలింది. తప్పుడు ప్రచారం చేసిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక జర్నలిస్టుని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కు కరోనా అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్ లోనూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాలని పిటిషన్ లో తీన్మార్ మల్లన్న కోరినట్టు తెలుస్తోంది. మరీ.. ఈ పిటిషన్ ని కోర్టు విచారణకి స్వీకరిస్తుందా ? అన్నది చూడాలి.