‘అప్సర’సతో వర్మ రొమాన్స్


మగువ, మద్యం, మీడియా అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఇష్టం. వాటికోసం ఆయన ఏమైనా చేస్తారు అనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని నేరుగా వర్మని అడిగితే.. అది నిజమే అంటారు. తాజాగా వర్మ ఓ ‘అప్సర’సని పట్టేశాడు. ఆమెని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. వర్మ తాజా చిత్రం ‘థ్రిల్లర్’ సినిమా ద్వారా అప్సర రాణి తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఒడిషాకి చెందిన అమ్మాయి అప్సర. నిండైన అందాలతో ఆకట్టుకుంటోంది.

అయితే తెరకు పరిచయం చేసేకంటే ముందే అప్సర అందాలని వర్మ ఆస్వాదిస్తున్నారు. ఆమెతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలని షేర్ చేశారు. అంతేకాదు.. అపర్సరతో వివిధ భంగిమలతో తీసిన ఫోటోలు.. ఇంకా చెప్పాలంటే వర్మ పైత్యంతో తీసిన కెమెరా యాంగిల్స్ ఫోటోలని షేర్ చేశారు. అంతేకాదు.. ఓడిషాలో ఇంతకంటే అందమైన అమ్మాయిలు ఉంటే.. వాళ్ల ఫోటోలని తనకి పంపమని కోరారు.

అప్సర మంచి నటి. అంతకంటే మంచి డ్యాన్సర్ అంటూ.. వర్మ ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక వర్మ పుణ్యమా అని అప్సర రాణికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కేవలం 7గంటల్లోనే అప్సర ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య 10వేలకి చేరింది. దీంతో అప్సర ఆనందానికి అవధుల్లేవ్. ఈ ఆనందంలో వర్మ ఏం కోరినా తీర్చేలా ఉంది.