భౌతిక దూరం.. బాలీవుడ్’ది అదే మాట !

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్ బంద్ అయ్యాయ్. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినా.. సినిమా షూటింగ్స్ మొదలవ్వడం లేదు. ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలని పాటిస్తూ షూటింగ్స్ నిర్వహించడం అసాధ్యం. సెట్ లో భౌతిక సాధ్యం కానీ పని. ఫ్యామిలీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ని చేయలేమని చేతులెత్తారు. ఇప్పుడు బాలీవుడ్ దర్శక-నిర్మాతలు కూడా ఇదే చెబుతున్నారు.

సెట్‌లో భౌతిక దూరం పాటించడమనేది జరగదు.. జరగబోదు. పాటిస్తాం అని చెబితే.. మనకు మనం అబద్ధం చెప్పుకోవడమే అవుతుందన్నారు బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా. వచ్చే ఏడాదిన్నర వరకు సినిమా షూటింగ్స్‌ నిదానంగా జరుగుతాయి. అంతేకాదు.. ఇది వరకు షూటింగ్స్‌కు పెట్టే ఖర్చు కన్న ఇప్పుడు 20శాతం ఎక్కువ ఖర్చవుతుంది. ఎందుకంటే షూటింగ్స్‌లో పాల్గొనేవారిందరికి కరోనా నుంచి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘తప్పడ్‌’ చిత్రానికీ దర్శకత్వం వహించారు. మహిళల ఆత్మగౌరవం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్టికల్‌ 15లో నటించిన యువ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాతో మరో సినిమా తీసేందుకు అనుభవ్‌ సిన్హా ప్లాన్‌ చేశారు.