TSలో డిగ్రీ, పీజీ పరీక్షలు.. 3వారాల తర్వాత క్లారిటీ !

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  పరీక్షలను రద్దు చేయాలంటూ ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని హైకోర్టుకు తెలిపారు. పరీక్షల రద్దు కుదరని పేర్కొన్నారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి మాత్రం పరీక్షలు రద్దు చేయాలని వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని, ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలపై మూడు వారాల తర్వాతే క్లారిటీ రానుంది.