‘పవర్ స్టార్’లో మెగాస్టార్ ని చూశారా ?

గాయం చేసి.. మందు రాయడం అంటే.. ఇదేనేమో ! సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులని గెలిచాడు. అది తెలియకుండా జై పవర్ స్టార్ అంటూ జై కొట్టాడు. ఇంతకీ మేటరేంటీ  అంటే.. ? వర్మ ‘పవర్ స్టార్’ టైటిల్ తో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అచ్చం పవర్ స్టార్ లా ఉండే ఓ వ్యక్తిని వెతికి పట్టుకొన్నాడు వర్మ.

ఇటీవల ఆయన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయ్యాయ్. తాజాగా పవర్ స్టార్ సినిమా నుంచి పవన్ మరో పోస్టర్ వదిలాడు. పవన్ తీవ్ర నిరాశలో ఉన్న ఫోటో ఒకటి వర్మ షేర్ చేశారు. ‘ఎన్నికల తర్వాత కథ’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా వర్మ ఫ్లో ఆగలేదు. పవర్ స్టార్ లో హీరో. పవర్ స్టార్ లో మెగాస్టార్ లుక్ ని షేర్ చేశారు. పవన్, చిరు ఒకే సోఫాలో కూర్చున్న పిక్ ని షేర్ చేశాడు. ఆ తర్వాత చీరలో రష్యన్ అమ్మాయి అంటూ.. మరో పోస్టర్ ని వదిలారు. మొత్తానికి వర్మ పవన్ పై పడిపోయారు.