నిఖిల్ సిక్స్ ప్యాక్ రెడీ


చందు మొండేటి-నిఖిల్ కలయికలో వచ్చిన ‘కార్తీకేయ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తీకేయ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకుంది. కరోనా ప్రభావం తగ్గాక సినిమా షూటింగ్ మొదలు కానుంది. పిపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు పై విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం నిఖిల్ సిక్స్ ప్యాక్ డెవలెప్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే తన సిక్స్ బాడీకి డెవలెప్ కి సంబంధించిన ఫోటోని నిఖిల్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మరో నాలుగు వారాల్లో ఫుల్ సిక్స్ ప్యాక్ లుక్ కనిపించబోతున్నట్లుగా తెలిపారు. ఇప్పుడు నిఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ రెడీ అయింది. ఆరు పలకల బాడీ ఫోటోని నిఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆమ్ కమింగ్ బ్యాక్. వర్క్ జరుగుతోందని తెలిపారు.