ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. ఆల్ పాస్ !
కరోనా ప్రభావంతో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణులైన వారు కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొంటామని తెలిపారు. మార్కుల మెమోలను జులై 31 తర్వాత కళాశాలల్లో పొందొచ్చని మంత్రి తెలిపారు.