మెగాస్టార్ సినిమాలో యూత్ మెగాస్టార్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఎవ్వరు నమ్మడం లేదు. ఆయనకి ముందుగానే ఆప్షన్ వెతికి పెట్టుకుంటున్నారు. దీనికి కారణం చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉండటమే. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చరణ్ కనిపించాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉండే చరణ్ ‘ఆచార్య’కు టైమ్ కేటాయించే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు తలెత్తాయ్. ఈ నేపథ్యంలోనే ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ ని ఒప్పించారు.

ఇక ఆచార్య తర్వాత ‘లూసిఫర్’ రిమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలోనూ పృధ్వీరాజ్ నటించిన పాత్రలో చరణ్ నటించాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ వలన అది సాధ్యం కాకపోవచ్చు. దీంతో చరణ్ కోసం అనుకున్న పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. విజయ్ ఓకే చెబితే.. మెగాస్టార్ తో యూత్ మెగాస్టార్ తెరను పంచుకోనున్నారు.