గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ఓ గుడివద్ద ఈ ఉదయం వికాస్ దూబెని పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జయిన్‌లోని ఓ ఆలయంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. అప్పటికే అనుమానం వచ్చిన ఆలయ సెక్యూరిటీ విచారించగా తప్పుడు ఐడీ కార్డు చూపించడంతోపాటు వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అరెస్టు చేశారు.

కాన్పూర్ 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో వికాస్ దూబే ప్రధాననిందితుడు. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబెనే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వికాస్ దూబే తృటిలో తప్పించుకున్నాడు. నిన్న తప్పించుకున్న వికాస్ దూబే ఈరోజు పోలీసులకి చిక్కాడు.