మంత్రి ధర్మాన కొడుకుకి కరోనా
తెలుగు రాష్ట్రాలో పలువురు ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ధర్మాన ఫ్యామిలీ మొత్తం హోంక్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలిసింది.
గత కొంతకాలంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ తరపున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయనకు, వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇన్నాళ్లు ఆయన వెంట తిరిగిన వారు అలర్ట్ అయ్యారు. వారంతా.. హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోతున్నారు.
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ? బుధవారం ఇడుపుల పాయలో జరిగిన వైఎస్ ఆర్ జయంతి కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఇడుపులపాయలో వైఎస్ ఆర్ సమాధి వద్ద జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులతో కలిసి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి.