ఆస్ట్రేలియాలో భారత నటికి ఘోర అవమానం !

భారత టీవీ నటి చాందిని భగ్వనానికి ఆస్ట్రేలియాలో ఘోర అవమానం ఎదురైంది. తాజా ఆ చేధు అనుభవం గురించి అభిమానులతో పంచుకొంది చాందిని. ఇటీవల తాను ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లాను. అక్కడ మెల్‌బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కాను. ఆ బస్సు చాలా దూరం ప్రయాణించిన తరువాత అనుమానం వచ్చి.. ఈ బస్సు సరైన ప్రదేశానికే వెళ్తుందా ? అని బస్సు డ్రైవర్ అడిగాను. కానీ సమాధానం రాలేదు.

కాసేపటికి ఆ బస్సులో ఉన్నందరకీ.. అదే అనుమానం వచ్చింది. దీంతో వారు డ్రైవర్ ని ప్రశ్నించారు. వారందరకి డ్రైవర్ చాలా గౌరవంగా సమాధానమిచ్చాడు. దీంతో తాను మరోసారి డ్రైవర్ ను అడగా. ఆయన ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. చెత్త భారతీయులారా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని బూతులు తిట్టాడు. తాను భయంతో బస్సు దిగేశాను’ అని చెప్పుకొచ్చింది. ఇది కచ్చితంగా జాతి వివక్షతనే అని వాపోయింది.