#Prabhas20 : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న #Prabhas20 ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని ప్రకటించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు ‘రాధేశ్యామ్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ప్రభాస్-పూజా హెగ్డేల రొమాంటిక్ లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ అదిరింది.

ఈ చిత్రానికి జిల్ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూరప్ నేపథ్యంలో సాగే చిత్రమిది. పునర్జన్మల నేపథ్యంలో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఫస్ట్ లుక్ లో కథకి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ చూస్తే.. ఈ సినిమా కథ చాలా ఏళ్ల కిందట సాగుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ బాషలో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది.