‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్.. కాపీ పేస్ట్ !

#prabhas20 ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రభాస్-పూజా హేగ్డేల రొమాంటిక్ లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. అయితే ఈ లుక్ పై అప్పుడే కాపీ మరకపడింది. ఇది కాపీ పేస్ట్ అంటూ నెటిజన్స్ తేల్చేశారు. దానికి సంబంధించిన రుజువుని రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ కి జతచేసి.. వైరల్ చేస్తున్నారు.

ఇంతకీ.. ఏ హాలీవుడ్ సినిమా నుంచి రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ కాపీ కొటారు అనుకుంటున్నారా.. ? సినిమా నుంచి కాదు. నారా లోకేష్-బ్రాహ్మాణీల పోజుని ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొట్టేశారు. అవునూ.. ఓ కార్యక్రమంలో లోకేష్-బ్రాహ్మాణి ఇచ్చిన పోజు.. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు రాధ్యేశ్యామ్ ఫస్ట్ లుక్ కూడా అదే పోజులో ఉండటం విశేషం.

కాకపోతే.. చిన్ని తేడా కనిపించింది. ప్రభాస్ స్థానంలో బ్రాహ్మాణి, పూజా స్థానంలో లోకేష్ కనిపించారు. మిగితాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడీ ఈ పోలిక నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. లోకేష్ ని ప్రభాస్ తో పోల్చి చూడటంపై తెదేపా కార్యకర్తలు ఖుషి అవుతున్నారు.