గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌


గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌దూబేని ఉత్తర ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఉదయం వికాస్‌దూబేని పోలీసులు యూపీ నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తాపడింది. దీంతో వికాస్‌దూబే పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దూబే మృతి చెందాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌దూబే.. పోలీసులకి దొరక్కుండా వారం రోజులు ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే గురువారం మధ్యప్రదేష్ లోని ఉజ్జయిని మహాంకాలి ఆలయంలో వికాస్ దూబేని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ తో వికాస్ దూబేని అరెస్ట్ చేశామని పోలీసులు. అలాంటిదేమీ లేదు. వికాస్ దూబేనే పోలీసులకి లొంగిపోయాడని స్థానికులు చెప్పినట్టు సమాచారమ్.

ఇక వికాస్ దూబే  ఎన్‌కౌంటర్‌ విషయంలోనూ యూపీ పోలీసులు తెలంగాణ దిశ ఘటనని ఫాలో అయినట్టు కనిపిస్తోంది. దిశ ఘటనలో నిందితులని సీన్ రీ కన్ స్ట్రక్షన్ సీన్ కోసం అని తీసుకెళ్లి  ఎన్‌కౌంటర్‌ చేశారనే ప్రచారం ఉంది. వికాస్ దూబె ని కూడా యూపీ నుంచి కాన్పూర్ తరలిస్తుండగా మార్గమద్యంలో వేసేసినట్టు సమాచారమ్.