సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. గత నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనది ఆత్మహత్య కాదు. హత్యే. బాలీవుడ్ నే ఆయన్ని హత్య చేసింది. బాలీవుడ్ లో బంధుప్రీతియే అందుకు కారణం. సుశాంత్ కి అవకాశాలు రాకుండా చేశారు. దీంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆత్మహత్యకు పాల్పడారని బాలీవుడ్ లో పలువురు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, రచయిత తుహిన్‌ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్‌ తిరావీతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సుబ్రహ్మణియన్ స్వామి సైతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.  ఇక సుశాంత్ కేసులో పోలీసులు ఇప్పటికే 30 మందికి పైగా విచారించారు. దర్శకులు భన్సాలీ, శేఖర్ కపూర్ లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.