దిల్ రాజు ఓటీటీ కంటెంట్ బిజినెస్

థియేటర్స్ మూతపడి మూడ్నేళ్లకి పైగా అవుతోంద్. కరోనా ప్రభావం తగ్గితేనే థియేటర్స్ తిరిగి తెరచుకుంటాయ్. అయితే ఇప్పట్లో కరోనా తీవ్రత తగ్గేలా లేదు. థియేటర్స్ తిరిగి తెరచుకొనేలా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి గిరాకీ పెరిగింది. దాన్ని గమనించిన బడా నిర్మాతలు, బ్యానర్లు ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ స్టార్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే గీతా ఆర్ట్స్ ‘అహా’ పేరిట ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప్రారంభించింది. సినిమాలు, వెబ్ సిరీస్ లని రిలీజ్ చేస్తోంది. యువీ క్రియేషన్స్, తదితర సంస్థలు కూడా సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకొనే ప్లాన్ లో ఉన్నారు. ఇక స్టార్  హీరోలు, హీరోయిన్స్ కూడా ఓటీటీ వేదిక ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా అటు వైపు చూస్తున్నారు. కానీ, ఆయన విభిన్నంగా వెళ్తున్నారు. అందరిలాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రెడీ చేసుకోవడం లేదు. ఓటీటీ కంటెంట్ తో బిజినెస్ చేసే ఆలోచన చేస్తున్నారు.

కంటెంట్ తయారీ, అలాగే ఎవరైనా ఓటిటికి ఏమైనా కంటెంట్ విక్రయించాలన్నా, తయారు చేయాలన్నా మధ్యవర్తిగా వ్యవహారించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు వేరే వాళ్లతో కలిసి శాటిలైట్ హక్కుల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం వుంది అని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు అదే రీతిగా ఓటిటి లోకి కూడా ప్రవేశిస్తున్నారు. హిట్ డైరక్టర్ శైలేష్ కథ అందిస్తుంటే, ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా మారుస్తూ, హీరో విష్వక్ సేన్ నిర్మాతగా ఓ ఓటిటి సినిమా తయారు చేయించే పనిలో వున్నారని తెలుస్తోంది.