బన్నీ పేరిట మోసాలు 

సెలబ్రిటీల పేర్లు వాడుకొని కేటుగాళ్లు మోసాలు పడుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయ్. వస్తున్నాయ్. ఇటీవల యువ దర్శకుడు అజయ్ భూపతి పేరుతో మోసాలకి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరిట భారీ మోసాలకి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్టయిల్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం కొత్త హీరోయిన్ కావాలంటూ సోషల్ మీడియాలో ప్రకటన వైరల్ అయింది. తను గీతా ఆర్ట్స్ లో డిజైనర్, మేకప్ మేన్ అని చెప్పుకుంటున్నాడు. అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తున్నాడు. రిఫరెన్స్ ఇస్తానని నమ్మబలుకుతున్నాడు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిల నుంచి లక్షలు గుంజాడు.

ఈ ప్రకటన గీతా ఆర్ట్స్ దృష్టికి రావడంతో.. వారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాడి కోసం గాలిస్తున్నారు.