కేటీఆర్-కిషన్ రెడ్డి.. ఓ శంకుస్థాపన !

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్ట్రీల్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేశారు.. ఇందిరా పార్క్ నుంది వీఎస్టీ వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరగనుంది. ఇందు కోసం రూ. 300కోట్లు ఖర్చు కానుంది. మరో 76కోట్లతో బాగ్ లింగంపల్లి దగ్గర మరో బ్రిడ్జ్ నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కరోనా లాక్‌డౌన్ సమయాన్ని జీహెచ్ ఎంసీ సద్వినియోగం చేసుకొంది. 10 నెలల్లో వేసే రోడ్లని కేవలం 2 నెలల్లోనే పూర్తి చేశారు. హైదరాబాద్ మరింత అభివృద్ది చెందాలటే ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలి. ఇందులో భాగంగానే స్టీల్ బ్రిడ్జిలని నిర్మిస్తున్నట్టు తెలిపారు.

రక్షణ స్థలాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆర్మీ స్థలాలని అప్పగిస్తే మరో 32 కిలో మీ. మేర స్కై బ్రిడ్జ్ లని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. కేటీఆర్ రిక్వెస్ట్ కి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు..