మరింత బోల్డ్’గా బిగ్ బాస్ 4

బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకొంది. నాల్గో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలో నాల్గో సీజన్స్ లో పాల్గొనేబోయే కంటెస్టెంట్స్ పేర్లు లీకుల రూపంలో బయటికొస్తున్నాయ్. బిత్తిరి సత్తి పేరు బిగ్ బాస్ 4 కోసం గట్టిగా వినిపిస్తోంది. అయితే నాల్గో సీజన్ కోసం హాట్ బ్యూటీల పేర్లు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయ్. శ్రద్దాదాస్, ఒకరిద్దరు కొత్త హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయ్.

అంతేకాదు.. నగ్నం బ్యూటీ శ్రీ పాకని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించినట్టు సమాచారమ్. నిజంగా నగ్నం బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తే ఏంకేముంది ? బిగ్ బాస్ 4కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. వర్మ వదిలిన గ్లామర్ బాణాల్లో శ్రీ రాపాక ఒకరు. ఇటీవలే నగ్నం ఓటీటీలో రిలీజై మంచి కలెక్షన్స్ రాబట్టింది. బిగ్ బాస్ 4 లోనూ స్వీటీ అదేనండీ.. శ్రీ రాపాక ఉంటే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ రావడం ఖాయం అంటున్నారు. కాకపోతే.. ఫ్యామిలీ షో కాస్త బోల్డ్ షోగా మారుతుందనే భయం కూడా ఉంది. ఇక నాల్గొ సీజన్ కి హోస్ట్ గా నాగార్జుననే కంటిన్యూ కాబోతున్నారని తెలిసింది