వర్మని లైట్ తీసుకున్న పవన్

‘పవర్ స్టార్’ టైటిల్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24నే రిలీజ్. ఇప్పటికే వర్మ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వరుస పోస్టర్స్ ని వదులుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన తాజా భార్య, మెగాస్టార్ స్టార్ చిరంజీవి లుక్ లని కూడా వదిలేశాడు. వాటిని చూస్తే పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉన్నాయ్.

ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమాపై పవన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఆయన వర్మకి ఏమైనా వార్నింగ్ ఇస్తారా ? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కానీ పవన్ వర్మని లైట్ తీసుకున్నాడు. పవర్ స్టార్ సినిమా గురించి సన్నిహితుల దగ్గర స్పందించిన పవన్.. కొద్దిసేపటిదాక నవ్వు ఆపుకోలేకపోయారట. అంతేకాదు.. ఈ సినిమాపై స్పందించడం వేస్తే. మనం స్పందిస్తే.. అది సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తీసుకొచ్చినట్టు అవుతోంది. అందుకే వర్మని లైట్ తీసుకొండని అభిమానులు, జనసేన కార్యకర్తలకి సూచించారట.