ఇండస్ట్రీలో కొత్త ఉద్యమం తీసుకొచ్చిన శ్రద్దా శ్రీనాథ్ 


#మీటూ పేరిట సినీ ఇండస్ట్రీలో పెద్ద ఉద్యమమే జరిగింది. అవకాశాల పేరిట కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిని వాడుకుంటున్నారు. లైంగిక వేధిస్తున్నారని బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, టాలీవుడ్ లో శ్రీరెడ్డి పెద్ద ఉద్యమమే చేశారు. కొత్త హీరోయిన్స్ మాత్రమే కాదు. సీనియర్ హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ బారినపడిన విషయాలు వెలుగులోకి వచ్చాయ్.

మీటూ ఉద్యమం పుణ్యమా ? అని మునుపటిలా దైర్యంగా కమిట్ అడిగేందుకు జంకుతున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ఉద్యమానికి తెరలేపింది హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. అదే పెళ్లైన హీరోయిన్స్ కి ఆఫర్లు ఇవ్వకపోవడంపై. దీనిపై సూటిగా ప్రశ్నించిన శ్రద్దా శ్రీనాథ్.. పెళ్లైన హీరోలకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశించింది. దీనిపై ప్రేక్షలకి పోల్ పెట్టింది. వారి సపోర్ట్ కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. నెటిజన్స్, పెళ్లైన హీరోయిన్స్ నుంచి శ్రద్దాకి భారీ మద్దతు లభిస్తోంది.

అయితే పెళ్లైన హీరోయిన్స్ విషయంలో కొన్నాళ్ల నుంచి మార్పులు కనిపిస్తున్నాయ్. వారికి అవకాశాలు వస్తున్నాయ్. మన సమంతనే చూడండి. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. అమలాపాల్ అంతే. అయితే శ్రద్దా శ్రీనాథ్ ఉద్యమంతో పెళ్లై అవకాశాలు రాని హీరోయిన్స్ కి కాస్త దైర్యం వస్తోందని చెప్పవచ్చు.