అమితాబ్’కు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కరోనా బారినపడిన సంగతి తెలిసింది. శనివారం అస్వస్థతతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్ కు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమితాబ్ ట్విట్ చేశారు. గత పదిరోజులుగా తనని కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
ఇక ఈ ఉదయం ఆసుపత్రి వర్గాలు అమితాబ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉన్నట్లు తెలిపారు. బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఐశ్వర్యరాయ్, జయా బచ్చన్ లకి మాత్రం కరోనా నెగటివ్ గా వచ్చింది. అయితే, పూర్తి స్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాలు మాత్రం ఇంకా రావాల్సి ఉంది.