కేసీఆర్’కు కేసుల హెచ్చరికలు

ఆదివారం వరంగల్ లో నిజామాబాద్ భాజాపా ఎంపీ అరవింద్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనని తెలంగాణ భాజాపా సీరియస్ గా తీసుకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర కీలక నేతలు సీఎం కేసీఆర్, తెరాస తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారంపై భాజాపా అధిష్టానం ఎలా స్పందించనుంది ? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నం. జాగ్రత్త. కేసులు తోడుతామని బండి సంజయ్ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవితపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. బీజేపీపై దాడులకు పాల్పడుతే సరైన సమాధానం చెబుతామని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కరోనాకు బయపడుతుంటే.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు.

కేంద్రంలో భాజపా అధికారంలో ఉందని తెరాస గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. భాజపా నేతలపై దాడి విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. తెరాస నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర అప్రభుత్వ వాటా లేని పథకాలు ఎన్నో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.