నిజమే.. ఈ అందాలు అరుదైనవే !

తెలుగు అందం ఈషా రెబ్బాకు స్టార్ హీరోయిన్ కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయ్. కానీ ఆమెకి అదృష్టం కలసిరావడం లేదు. అందుకే ఇంకా హీరోయిన్ గా బిజీ అయ్యే ప్రయత్నాల్లోనే ఉంది. ఇందుకోసం ఈషా చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తనలోని అందాలన్ని అన్నీ యాంగిల్స్ లో చూపిస్తూ నాన్ స్టాప్ గా ఫోటో షూట్స్ చేస్తోంది.

ఇక నటన గురించి అంటారా ? ఇప్పటికే ఈషా మంచి నటి అనిపించుకుంది. ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఈషా. దాదాపు 10 సినిమాల్లో నటించింది. ఇందులో తారక్-త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ కూడా ఉంది. నటన తెలిసిన నటికి అందం తోడైతే స్టార్ హీరోయిన్ అయిపోవొచ్చు. అందుకే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా.. తనలో గ్లామర్ యాంగిల్ ని చూపించే క్రమంలో వరుసగా ఫోటో షూట్స్ చేస్తోంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా ఎర్రచీర, బ్లాక్ జాకెట్ లో ఈషా షేర్ చేసిన ఫోటోలు బాగున్నాయ్. వీటికి ‘రియల్ ఈజ్ రేర్’ అనే కామెంట్ పెట్టింది ఈషా. నిజంగానే ఇవి అరుదైన ఫోటోల్లా అందంగా ఉన్నాయ్. అందుకే జనాలు ఎగబడి మరీ.. చూస్తున్నారు.