ఓటీటీ కంటెంట్ పై కేంద్రం అసంతృప్తి


కరోనా పుణ్యమా అని థియేటర్లు మూతపడ్డాయి. సినీ పరిశ్రమ రూపు రేఖలు మారిపోయాయ్. డియో కంటెంట్‌ అందించే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల డిమాండ్ పెరిగింది. అయితే ఓటీటె కంటెంట్ లో అసభ్యత ఎక్కువైంది. దీనిపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో వస్తున్న కంటెంట్‌పై అసంతృప్తి వ్యక్తంచేశారు. స్వీయనియంత్రణ ఉండాల్సిందేనని స్పష్టంచేశారు.

ఫిక్కీ నిర్వహించిన ఓ సదస్సులో గోయల్ మాట్లాడారు. నియంత్రణలేని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో వచ్చే కంటెంట్‌ కొన్నిసార్లు అభ్యంతరకరంగా ఉంటోంది. తప్పుడు సమాచారం ఉంటోందని, దేశం, సమాజాన్ని పేలవంగా చిత్రీకరిస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. సృజనాత్మక వ్యక్తీకరణను స్వాగతిస్తానని, అదే సమయంలో విదేశాల్లో రూపొందుతున్న కంటెంట్‌ అనువదించేందుకు ఓ హద్దు ఉంటుందని గోయల్‌ అన్నారు.