భాజాపా ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి

నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. వరంగల్ అర్బన్‌ జిల్లా భాజపా కార్యాలయంలో ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది తెరాస కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు.అరవింద్‌ కారును అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో తెరాస-భాజాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ నేత రావు పద్మ సృహకోల్పోయారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి శృతిమించడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులను పోలీసుల అరెస్ట్ చేశారు. తమ ఎంపీపై తెరాస కార్యకర్తల దాడిని భాజాపా అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా ? అన్నది చూడాలి. అదే జరిగితే.. ఎంపీపై దాడి వ్యవహారం తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడం ఖాయం.