బాలయ్య విలన్ ఫిక్స్


బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఓ పాత్రలో ఫాక్షనిస్టుగా, మరో పాత్రలో అఘోరాగా కనిపిస్తున్నారు. ఇక బాలయ్య పక్కన ఇద్దరు కొత్త హీరోయిన్స్ కనిపించనున్నారు. ఇప్పటికే ఓ అమ్మాయిని ఖరారు చేశారు. అతి త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మొదటి నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరు వినిపిస్తోంది. మొదట బాలయ్య సినిమాని చేసేందుకు సంజయ్ ఒప్పుకోలేదని.. ఇప్పుడు మాత్రం ఓకే చెప్పారని సమాచారమ్. ప్రస్తుతం సంజయ్ కేజీఎఫ్ 2లో అధిరా పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజైన కొద్దిరోజులకే బాలయ్య సినిమా కూడా రెడీ అయిపోవచ్చు. రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ప్రేక్షకులని అలరిస్తే బాగుంటుదని సంజయ్ ఓకే చెప్పినట్టు సమాచారమ్.