రాజస్థాన్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలైట్ రెబల్ గా మారడంతో ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలైట్ వర్గాలు రిసార్ట్ రాజకీయాలకి తెరలేపాయి. స్టార్ హోటల్ లో మకాం వేశాయి. అయితే సీఎం అశోక్ గెహ్లాట్ సోమవారం చెప్పిన లెక్కలు మారాయ్.
తన వెంట 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. అయితే గెహ్లాట్ బృందంలోని 20 మంది ఎమ్మెల్యేలు హోటల్ నుంచి బయటికి వచ్చేశారు. ఇక తనకి 30 ఎమ్మెల్యేల బలం ఉందని సచిన్ పైలైట్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సచిన్ పైలైట్ ని బుజ్జగిస్తున్నారు. అయితే సీఎం క్యాండిడేటుని మారిస్తే మద్దతిస్తానని సచిన్ అంటున్నారు.
మొత్తం రాజస్థాన్ అసెంబ్లీకి 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటిలో బీజేపీ 72 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించి సీఎం అశోక్ గెహ్లాట్ బృందంలో 102 మంది ఎమ్మెల్యేలు అని చెబుతున్నా.. ఆ సంఖ్య 80కే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. సచిన్ పైలైట్ కు 25 మందికిపైగా ఎమ్మెల్యే మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది.