హీరోయిన్ డ్రైవర్’కు కరోనా

కరోనా మహమ్మారికి సామాన్యుడు-సెలబ్రిటీ, పేద-ధనిక, రాజు-బంటు అనే తేడానే లేదు. అందరికి సోకుతోంది. ఇక బాలీవుడ్ లో స్టార్ కుటుంబాలు కరోనా బారినపడుతున్నాయ్. ఇప్పటికే బోనీకపూర్, అమితాబ్, అమీర్ ఖాన్, రేఖ.. ఫ్యామిలీలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా సైఫ్ అలీఖాన్ కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో సారా, ఆమె త‌ల్లి అమ్రితా సింగ్‌, సోద‌రుడు ఇబ్ర‌హీం అలీ ఖాన్ ‌లు కరోనా టెస్టులు చేయించుకొన్నారు. వీరికి నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సారా డ్రైవర్ ని మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని సారా అలీఖాన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది.