తెలంగాణలో కరోనా రికవరీ రేంటెంతో తెలుసా ?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 30వేలకి చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. అదే సమయంలో కరోనా రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిచ్చే విషయం. దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉంది. తెలంగాణలో మాత్రం రికవరీ రేటు 65.48శాతంగా ఉంది.

తెలంగాణలో కరోనా కేసులు, రికవరీ రేటు, మరణాల గురించి మంగళవారం వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,178 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 65.48 శాతంగా ఉన్నట్లు చెప్పారు. కరోనా బాధితుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే చనిపోయారన్నారు.

కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని డైరెక్టర్ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోరారు. తెలంగాణలో 85శాతం మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదన్నారు. హోం ఐసోలేషన్‌ సదుపాయం లేనివారికి ప్రభుత్వ ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నామని, మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 9786 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని తెలిపారు.