కేసీఆర్ కు కొత్త సమస్య తెచ్చిపెట్టిన జగన్
ఇంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొనే నిర్ణయాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండేవి. ఉద్యోగుల జీతాల పెంపు, కొత్త పథకాలని తీసుకొచ్చే విషయంలో పలుమార్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాయి. దీంతో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు తలపట్టుకొనేవారు. అయితే జగన్ సీఎం అయ్యాక పరిస్థితి మారింది.
సీఎం జగన్ తీసుకొనే కొన్ని నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా ఉన్నాయ్. ఏపీలోని పేదలకి పెద్ద ఎత్తుల ఇళ్ల స్థలాల పంపిణికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి సరైన సమయంలో జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల పాటు వారికి ఆరోగ్య భీమ, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు చేయాలని సూచించారు.
ఈ ఎఫెక్ట్ ఏమోగానీ తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. హైదారాబాద్ గాంధీ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకి దిగారు. తమని పర్మినెంట్ చేయాలి. బేసిక్ సాలరి రూ. 20000 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 300 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకి దిగారు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొన్న మరుసటి రోజే తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకి దిగడంతో విశేషం. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొత్త సమస్యని తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది.