మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై కేటీఆర్ సమీక్ష


మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉద్యోగాలని భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంగళవారం మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న పట్టణీకరణ, ప్రజలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

నూతన పురపాలక చట్టం విధివిధానల మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణదారుల అవసరాల మేరకు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్‌, ఇన్‌ఫా విభాగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.