పవన్ తో పోటికి దిగిన మహేష్ !


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు పోటికి దిగినట్టు కనబడుతోంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ నేపథ్యంలోనే రెండు నెలల ముందుగానే పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సోమవారం సాయంత్రం నుంచి 
#AdvanceHBDPawanKalyan యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ ల్ వైరల్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ యాష్ ట్యాగ్ 10మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. అంతేకాదు… ఇండియాలోనే ట్రెడింగ్ టాప్ లో నిలిచింది.

ఇప్పుడు పవన్ కి పోటీగా అన్నట్టుగా మహేష్ రంగంలోకి దిగారు. ఆగస్టు 9న మహేష్ బర్త్ డే. ఈ నేపథ్యంలో #AdvanceHBDMaheshBabu యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. మహేశ్ కొత్త లుక్ తో ఈ యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ముందస్తుగా ఈ ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. కానీ పవన్ బర్త్ డే యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉండగానే మహేష్ రంగంలోకి దిగిపోవడంతో.. వీరిద్దరు పోటీ పడుతున్నారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయ్.