సర్కారు వారి పాట.. మహేష్ లుక్ !


పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ కథానాయిక. బలమైన ఎమోషన్స్ కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ ‘సర్కారు వారి పాట’లోని మహేష్ లుక్ అని చెప్పుకొంటున్నారు.

ఇందులో మహేష్ స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. నిజంగానే సర్కారు వారి పాటలో మహేష్ ఆటగాడిగా కనిపిస్తారా ? లేక తాజా లుక్ ఏదైనా బ్రాండ్ కోసం చేశారా ? అన్నది తెలియాల్సి ఉంది. అయితే కొత్త లుక్ అదిరిపోయిందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. #AdvanceHBDMaheshBabu యాష్ ట్యాగ్ ని వైరల్ చేసే క్రమంలో ఈ కొత్త లుక్ ని కూడా వైరల్ చేసేస్తున్నారు.  కరోనా ప్రభావం లేకుంటే సర్కారు వారి పాట రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయేది.