సచిన్‌ పైలట్ కింగ్ అవుతాడా ?

రాజస్థాన్‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సచిన్‌ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ తీర్మానించింది. ఆయన వెంట వెళ్లిన ఇద్దరు మంత్రులు విశ్వేందర్‌ సింగ్‌, రమేశ్‌ మీనాల ఉద్వాసన పలికారు. ఆ వెంటనే వీరి తొలగింపుపై తొలగింపునకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా కూడా ఆమోదముద్ర వేశారు.

రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవడంపై సచిన్‌ పైలట్‌ స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరు’ అంటూ ట్విటర్‌లో స్పందించారు. అయితే పార్టీ మారే విషయంపై ఆయన స్పందించలేదు. మరోవైపు సచిన్‌ పైలట్‌ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం మథూర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు భాజపాలో చేరనంటూ చెబుతున్న సచిన్‌ పైలట్‌.. ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేవ్.