‘హోమ్ ఐసోలేషన్’లో ఉండేవారు ఈ నెంబర్ కు ఫోన్ చేయండి !
తెలంగాణ ప్రభుత్వం ‘టెలి మెడిసిన్’ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా పాజిటివ్ గా వచ్చిన వారు ఇంటి దగ్గరే చికిత్స పొందవచ్చు. ప్రభుత్వమే ఉచితంగా మందులని పంపిస్తుంది. అయితే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కోసం ప్రభుత్వం కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న ఎటువంటి సందేహాలున్నా 180059912345 నెంబర్ కు కాలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,550 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,221కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 365కి చేరింది. కొత్తగా కరోనా నుంచి కోలుకొని 1,197 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్ అయినవారి సంఖ్య 23,679కి చేరింది. ప్రస్తుతం 12,178 మంది వైద్యం పొందుతున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 65.48 శాతంగా ఉంది. కరోనా బాధితుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే చనిపోతున్నారు.
call centre phone number for home isolation : 180059912345
— Eatala Rajender (@Eatala_Rajender) July 14, 2020