సుజనా.. ఓ జూనియర్ ఆర్టిస్ట్ !
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సారి భాజాపా ఎంపీ సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా సుజనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా.. ఓ జూనియర్ ఆర్టీస్ట్. ఆయన చంద్రబాబు కోవర్ట్. సుజనా వేషాలు చూసి భాజాపా నేతలే నవ్వుకుంటున్నారు అంటూ వరుస ట్విట్స్ చేశారు.
‘సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే కమెడియన్ ని గుర్తు తెచ్చుకుంటూ. కెమరా ముందుకు వచ్చినపుడే కాషాయం. మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు’
‘సుజనా చౌదరి.. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్. బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి’ అంటూ వరుస ట్విట్స్ చేశారు విజయసాయి.
సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే కమెడియన్ ని గుర్తు తెచ్చుకుంటూ. కెమరా ముందుకు వచ్చినపుడే కాషాయం. మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2020
సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్ . బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2020