లూసిఫర్ : సుజీత్ ప్లేసులో వినాయక్ ?
మలయాళం హిట్ ‘లూసిఫర్’ను చిరంజీవి కథానాయకుడిగా తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రిమేక్ బాధ్యతలని యువ దర్శకుడు సుజీత్ చేతిలో పెట్టారు. ఇప్పటికే సుజీత్ స్కిప్ట్ పనులు పూర్తి చేశారు. కరోనా ప్రభావం తగ్గి.. ఆచార్య షూటింగ్ పూర్తికాగానే తెలుగు లూసిఫర్ సెట్స్ మీదకు వెళ్లనుందనే ప్రచారం జరుగుతోంది.
ఇంతలో ఈ సినిమా గురించి షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ ని తప్పించినట్టు సమాచారమ్. ఆయన స్థానంలో వివి వినాయక్ ని తీసుకున్నారని తెలిసింది. సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతృప్తి చెందకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మొత్తానికే సుజీత్ ని తీసేసి.. వినాయక్ ని పెట్టుకున్నారా ? లేక స్క్రిప్ట్ పనుల్లో వినాయక్ సాయం చేస్తున్నారా ? అన్నది స్పష్టత రావాల్సి ఉందని చెప్పుకొంటున్నారు.
ఇక వినాయక్ కు మెగా పల్స్ బాగా తెలుసు. ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. మాస్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ అయితే లూసిఫర్ రిమేక్ ని బాగా డీల్ చేస్తాడని మెగాస్టార్ భావిస్తున్నట్టు సమాచారమ్. నిజంగా ఈ ప్రాజెక్ట్ చేజారితే సుజీత్ పరిస్థితి దారుణంగా తయారు కానుంది. ఇప్పటికే సాహో సినిమాని బాగా డీల్ చేయలేకపోయారు. ఆ సినిమా ప్లాపుకి పూర్తి బాధ్యుడు సుజీత్ అనే ముద్రపడిపోయింది. ఇప్పుడు చేతికొచ్చిన మెగాస్టార్ సినిమా చేజారితే.. పెద్ద నష్టమే.