యంగ్ హీరోయిన్’తో కలిసి చిరు మాస్క్ ప్రచారం
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన సినీతారలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సినీ కార్మికులని, పేదలని ఆదుకోవడానికి తమ వంతు సాయం చేశారు. మరోవైపు, కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతుగా ప్రచారం చేశారు. చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కరోనాపై చిరు జాగ్రత్తలు చెప్పారు. మాస్క్ తప్పనిసరిగా వాడాలంటూ యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బాతో కలిసి ప్రచారం చిత్రాన్ని చేశారు మెగాస్టార్.
ఈషా రెబ్బా పెదాలకి లిప్ స్టిక్ పెట్టుకొని చిరు నవ్వులు చిందిస్తుండంతో.. వీడియో ప్రారంభం అయింది. స్టయిల్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ‘చిరు నవ్వు మొహానికి అందం. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే మొహాననికి మాస్క్ ధరించడం ఎంతో అవసరం. మాస్క్ ని తప్పనిసరిగా ధరించండి. వీలైనన్నీ సార్లు చేతులు శుభ్రంగా కడుకోండి. సాంఘిక దూరం పాటించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే మీ కుటుంబాన్ని.. ఈ దేశాన్ని కాపాండండి’ అంటూ చిరు సందేశం ఇచ్చారు.
Thank you @ActorKartikeya @YoursEesha #chaitanbharadwaj ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your commitment to the society. #SVVishweshwar #ShivramApte #Pappu #Babji pic.twitter.com/k6zyniBfc1
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020