కరోనాపై ఆందోళన వద్దు.. నిర్లక్ష్యం వద్దు : కేసీఆర్

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్దన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కరోనా కట్టడిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్దు. కరోనా సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదు, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉంది.

జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువ అని అన్నారు. రికవరీ రేటు 67 శాతం ఉన్నందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  ప్రస్తుతం ఆస్పత్రుల్లో 3,692 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. తీవ్రమైన జబ్బులున్న 200 మంది తప్ప మిగతావారు కోలుకుంటున్నారు. లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.కరోనాతో సహజీవనం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి” అన్నారు.