ఏపీలో సైకిళ్ల స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్’కు రంగం సిద్ధం ?

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తొవ్వేపనిలో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, నకిలీ పత్రాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అరెస్ట్ కాబోతున్నారని వైసీపీ ముఖ్యనేతలే చెబుతున్నారు.

టీడీపీ హయాంలో ‘బడికొస్తా’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద బాలికలకి ఉచితంగా సైకిళ్లు అందజేశారు. అయితే ఈ పథకం కింద భారీ స్కామ్ జరిగినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ స్కామ్ లో గంటా అరెస్ట్ తప్పదనే లీకులు ఇస్తున్నారు. తాజాగా బడికొస్తా పథకం గురించి వైసీపీ ఎంపీ విజయసాయి సైటైరికల్ ట్విట్ చేశారు.

“బడికొస్తా’ పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేసారట. ఎందరికి అందాయో,ఇచ్చినట్టు రికార్డుల్లో రాసారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల ‘గంట’లు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది” అంటూ విజయసాయి ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గంటా అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.